
విశ్వకరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లాన్ జోడీగా చేస్తున్న దిల్‌రుబా 14న విడుదల కావలసి ఉండగా అనివార్య కారణాల వలన మార్చి 14 కి వాయిదా పడింది.
సినిమా రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో గురువారం సాయంత్రం 5..01 గంటలకు దిల్‌రుబా ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ట్విట్టర్‌లో ప్రకటించారు. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా సూపర్ హిట్ అవడంతో దిల్‌రుబాపై భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల కిరణ్ అబ్బవరం తెలుగు ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ సినిమా ప్లాట్ ఊహించి చెప్పినవారికి ఈ సినిమాలో తన కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బైక్‌ని బహుమతిగా ఇస్తానని. బైక్ గెలుచుకున్న వ్యక్తితో కలిసి అదె బైక్ మీద దిల్‌రుబా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడ్డానికి వస్తానని కిరణ్ అబ్బవరం చెప్పారు. దీనికి అనూహ్యమైన స్పందన వస్తోంది.
దిల్‌రుబా సినిమాకి కధ, దర్శకత్వం: విశ్వకరుణ్, సంగీతం: శామ్ సిఎస్, కెమెరా: డానియల్ విశ్వాస్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేశారు.
శివం సెల్యులాయిడ్స్ సమర్పణలో యూడ్లీ ఫిల్మ్ బ్యానర్‌పై ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరేగమతో కలిసి రవి, జోజో రోజ్, రాకేశ్ రెడ్డి ఈ సినిమా నిర్మించారు.