యుద్ధంలో డాన్స్ కాంపిటీషన్!

యుద్ధం అంటే నిజంగా యుద్ధం కాదు.. బాలీవుడ్‌ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్‌ యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్‌ కలిసి చేస్తున్న వార్-2. వీరిద్దరూ గొప్ప డాన్సర్స్ అని అందరికీ తెలిసిందే. కనుక ఈ సినిమాలో వారి టాలెంట్ ప్రదర్శించేందుకు సుమారు 500 మంది డాన్స్ బృందంతో ఓ డాన్స్ సన్నివేశం చిత్రీకరిస్తున్నారు.

ముంబయిలోని యశ్ రాజ్ స్టూడియోస్‌లో దీని కోసం అమృత్ మహల్ అనే భారీ సెట్ వేసి దానిలో ఈ పాట షూటింగ్‌ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా నాటు నాటు పాటకి జూ.ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ చేసిన డాన్స్ కంటే గొప్పగా ఈ డాన్స్ గొప్పగా ఉండాలని దర్శకుడు అయాన్ ముఖర్జీ, కొరియోగ్రాఫర్ బాస్కో మార్టిన్, సంగీత దర్శకుడు ప్రీతం ప్లాన్ చేసి తీస్తున్నారట!

పూర్తి యాక్షన్ చిత్రమైన వార్-2 లో కియరా అద్వానీ ఓ హీరోయిన్‌గా నటిస్తోంది. 2019 లో విడుదలైన సూపర్ హిట్ మూవీ ‘వార్’ కి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది ఆగస్ట్ 14న విడుదల కాబోతోంది.