
తమిళ నటుడు అజిత్ కుమార్, త్రిష జంటగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తెలుగులో కూడా విడుదల చేస్తునందున టీజర్ విడుదల చేశారు. అధ్విక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తీసిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది.
అజిత్ సినిమాలంటేనే పూర్తి యాక్షన్ సినిమాలు. కనుక‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ టీజర్‌లో కూడా అదే కనపడింది. “మనం ఎంత గూ...డ్‌గా ఉన్నాకూడా.. ఈ లోకం మనల్ని బ్యా...డ్‌గా చేస్తుంది... జీవితంలో ఏమేమీ చేయకూడదో... కొన్నిసార్లు అవన్నీ చేయాలి బేబీ..” వంటి డైలాగ్స్ అజిత్ కుమార్ నోట వింటే అభిమానులు పులకరించిపోవడం ఖాయం.
ఈ సినిమాకు సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కెమెరా: అభినందన రామానుజన్, స్టంట్స్: సుప్రీం సుందర్, కాలోయిన్ వడేనిచరోవ్, ఎడిటింగ్: విజయ్ దేవరకొండ వేలుకుట్టి చేశారు.