రాబిన్ హుడ్ తమ్ముడు కూడా రెడీ అట!

నితిన్-వెంకీ కుడుమల కాంబినేషన్‌లో తీసిన ‘రాబిన్ హుడ్’ మార్చి 28న విడుదల కాబోతుండగా, శ్రీరామ్ వేణు దర్శకత్వంలో చేస్తున్న ‘తమ్ముడు’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కనుక తమ్ముడు మే 9న ప్రేక్షకులని పలకరించడానికి రాబోతున్నట్లు తాజా సమాచారం. అంటే 5 వారాల వ్యవధిలో రెండు సినిమాలు రాబోతున్నాయ్యన్న మాట!

దర్శకుడు శ్రీరామ్ వేణు పవన్ కళ్యాణ్‌తో సూపర్ హిట్ ‘వకీల్ సాబ్’ ఇచ్చిన తర్వాత తీస్తున్న సినిమా ‘తమ్ముడు’ కనుక ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. వకీల్ సాబ్ కోర్టు డ్రామా కాగా తమ్ముడు క్రీడా నేపధ్యంతో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో కన్నడ భామ సప్తమి గౌడ నితిన్కి జోడీగా చేస్తోంది. లయ ఓ కీలకపాత్ర చేస్తోంది.

శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీతం: అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: సమీర్ రెడ్డి చేస్తున్నారు.