
సూపర్ హిట్ మ్యాడ్ సినిమాకి సీక్వెల్‌గా తీస్తున్న ‘మ్యాడ్ స్క్వేర్’ మార్చి 29 న విడుదల కాబోతోంది. కానీ ఒక్కరోజు ముందుగా అంటే మార్చి 28న పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలవుతుంది.
ఒకవేళ అదే రోజు వీరమల్లు వస్తే మ్యాడ్ స్క్వేర్ వాయిదా వేసుకుంటామని నిర్మాత నాగ వంశీ చెప్పేశారు. ఇది మంచి కామెడీ సినిమా కనుక థియేటర్‌కి వచ్చిన ప్రేక్షకులు హాయిగా నవ్వుకుంటూ సినిమా చూసి ఎంజాయ్ చేసి వెళ్తారని నాగ వంశీ చెప్పారు. కనుక వీరమల్లు వంటి పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు కొంత గ్యాప్ తీసుకొని మా సినిమా విడుదల చేసుకుంటామని చెప్పారు.
‘మ్యాడ్ స్క్వేర్’లో నార్నె నితిన్, సంగీత శోభన్, రామ్ నితిన్, ప్రియాంక జవాల్కర్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఇటీవల విడుదలైన దీని టీజర్‌కి మంచి ఆదరణ లభిస్తోంది. కనుక సినిమాపై చాలా బారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కళ్యాణ్ శంకర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: శామ్దత్, ఆర్ట్: పెనుమర్తి ప్రసాద్, ఫైట్స్: కరుణాకర్ చేస్తున్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై హారిక సూర్యదేవర, సాయి సూర్యదేవర ఈ సినిమా నిర్మిస్తున్నారు. మార్చి 28న హరిహర వీరమల్లు విడుదల కాకపోతే మార్చి 29న ఈ సినిమా థియేటర్లలో విడుదలవుతుంది.