శ్రీవిష్ణు మృత్యుంజయ్‌ టైటిల్‌ టీజర్‌ చూశారా?

శ్రీవిష్ణు స్వాగ్‌ సినిమా పెద్దగా ఆడకపోయినా తన నటనతో అందరినీ మెప్పించారు. దాని తర్వాత శ్రీవిష్ణు ‘మృత్యుంజయ్‌’ అనే మరో సినిమా మొదలుపెట్టాడు. ఈ సినిమా టైటిల్‌ టీజర్‌ ఈరోజు విడుదల చేశారు. టైటిల్‌ ‘మృత్యు అండ్ జయ్’ అని సూచించారు కనుక ఇది కూడా సోషియో ఫాంటసీ చిత్రం అయ్యుండవచ్చు.  

హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తీస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా రెబా జాన్ నటిస్తోంది. ఈ సినిమాకు సంగీతం: కాల భైరవ్‌, కెమెరా: విద్యా సాగర్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్ చేస్తున్నారు. 

లైట్ బాక్స్, పిక్చర్ పర్ఫెక్ట్ బ్యానర్లపై రమ్య గుణ్ణం సమర్పణలో సందీప్ గుణ్ణం, వినయ్ చక్రవర్తి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.