అమెజాన్ ప్రైమ్‌లో షకీల

ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో శృంగార నటిగా ఓ వెలుగు వెలిగిన షకీల జీవితకధ ఆధారంగా ఆమె పేరుతోనే 2021లో సినిమా విడుదలైంది. ఇంద్రజీత్ లంకేష్ దర్శకత్వంలో హిందీలో నిర్మించిన షకీల సినిమాని తెలుగుతో సహా దక్షిణాది భాషల్లో డబ్ చేసి విడుదల చేశారు. 

సినీనటిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని తపించిన షకీల, తప్పటడుగులు వేసి శృంగార నటిగా మిగిలిపోవడం, ఆమె సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను చూపించాలనే ఉద్దేశ్యంతో షకీల తెరకెక్కించారు. 

కానీ సినిమాలో వాటి కంటే అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా పైరసీకి గురయ్యి యూట్యూబ్‌లోకి వచ్చేయడంతో నిర్మాత ప్రకాష్ పళని చాలా నష్టపోయారు. నాలుగేళ్ల క్రితం విడుదలైన ఆ సినిమా ఇప్పుడు అకస్మాత్తుగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం అవుతోంది. 

ఈ సినిమాలో రిచా చద్దా, పంకజ్ త్రిపాఠి, సందీప్ మలాని, కాజోల్ చుగ్‌, ఏస్తర్‌ నోరన్హ, రాజీవ్ పిళ్లై, శివరానా తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ప్రస్తుతం షకీలా హిందీ వెర్షన్ అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారమవుతోంది. త్వరలోనే తెలుగుతో సహా అన్ని భాషలలో ప్రసారమవుతుంది.