
ఒకప్పుడు అక్కినేని నాగేశ్వర రావు, ఆ తర్వాత ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున వరుసపెట్టి అనేక సూపర్ హిట్ సినిమాలు అందించారు. కానీ ఆ తర్వాత నాగార్జునతో సహా ఆయన ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ ఒక్క హిట్ కోసం ఎన్ని సినిమాలు చేస్తున్నా ఫలించడం లేదు. చందూ మొండేటి దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చేసిన ‘తండేల్’తో వారి ప్రయత్నం ఫలించింది.
తండేల్ సూపర్ హిట్ అవడమే కాక అక్కినేని కుటుంబం, వారి అభిమానుల చిరకాల వందకోట్లు కలెక్షన్స్ రికార్డ్ కూడా సాధించింది. నాగ చైతన్య కెరీర్లో తొలిసారిగా తండేల్ సినిమా డిజిటల్ రైట్స్ కూడా భారీ ధర లభించింది. నెట్ఫ్లిక్స్ సంస్థ భారీ మొత్తం చెల్లించి ఈ సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది.
ఒప్పందం ప్రకారం థియేటర్లలో సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో ప్రసారం చేయాలి. తండేల్ సినిమా ఫిబ్రవరి 7 న విడుదలైంది కనుక మార్చి 7 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారమయ్యే అవకాశం ఉంది. కనుక నేడో రేపో నెట్ఫ్లిక్స్ అధికార ప్రకటన చేయవచ్చు.