తెలుగులో చావా మార్చి 7న విడుదల

ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత గాధ ఆధారంగా హిందీలో తీసిన చావా సూపర్ హిట్ అవడంతో, ఆ సినిమాని తెలుగులో డబ్బింగ్ చేసి మార్చి 7న విడుదల చేయబోతున్నామని ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. 

లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో విక్కీ కౌశల్, రష్మిక మందన శంభాజీ, ఏసుభాయిగా నటించారు. ఈ సినిమాలో ఔరంగ జేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు. ఫిబ్రవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన చావాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టడంతో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలలో హిందీ వెర్షన్ విడుదల కాగా తెలుగు ప్రేక్షకులు దానిని సూపర్ హిట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగులో విడుదలవుతుండటంతో హిందీ అర్ధంకాని ప్రేక్షకులు చూసి ఆనందించవచ్చు.