
విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘లైలా’ రిలీజ్ అయిన రోజే నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో చాలా నిరాశ చెందినప్పటికీ, ఆ షాక్ నుంచి వెంటనే తేరుకొని, సూపర్ హిట్ మూవీ ‘జాతి రత్నాలు’ దర్శకుడు అనుదీప్ దర్శకత్వంలోఅనుకున్న ‘ఫంకీ’ సినిమా షూటింగ్‌కి సిద్దమైపోయాడు.
ఇప్పటికే ఈ సినిమా పూజా కార్యక్రమాలు పూర్తయినందున బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ సినిమా ‘ఫన్-ఫ్యామిలీ-ఎంటర్టెయినర్’ అని దర్శకుడు అనుదీప్ ముందే చెప్పేశాడు. ముందు ఈ సినిమాలో హీరోయిన్ ఆషికా రంగనాద్‌ని అనుకున్నప్పటికీ ఆమె స్థానంలో కాయడు లోహర్‌ని తీసుకోబోతున్నట్లు తాజా సమాచారం. ఇటీవల విడుదలైన ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలో తన అందచందాలు, నటనతో ప్రేక్షకులను మెప్పించి దర్శకుడు అనుదీప్ దృష్టిలో పడింది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ సినీ దర్శకుడుగా నటించబోతుంటే, హీరోయిన్ నిర్మాతగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. కనుక నిర్మాత, దర్శకుడు జోడీ ప్రేమలో పడితే కామెడీకి కొరత ఉండదు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనుదీప్, సంగీతం: భీమ్స్ సీసీరిలియో, కెమెరా: సురేష్ సంగం, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ ఈ సినిమా నిర్మించబోతున్నారు.