
రామాయణ, మహాభారతాలపై ఇప్పటి వరకు ఎన్ని భాషలలొ ఎన్ని వందల సినిమాలు వచ్చాయో లెక్కేలేదు. అయినప్పటికీ ఎవరో ఒకరు తీస్తూనే ఉన్నారు. బాగుంటే ప్రేక్షకులు నీరాజనాలు పడుతూనే ఉన్నారు.
ప్రభాస్ శ్రీరాముడుగా చేసిన ఆదిపురుష్ సినిమాతో దర్శకుడు ఓం రౌత్ పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయడంతో వందల కోట్లు పెట్టి తీసిన ఆ సినిమాని ప్రేక్షకులు నిర్ధాక్షిణ్యంగా తిరస్కరించారు.
తాజాగా బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా ‘రామాయణ’ పేరుతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వారిరువురూ పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేశారు.
ఈ సినిమాలో కన్నడ నటుడు యశ్ రావణాసురుడిగా నటిస్తున్నారు. ఇప్పుడు ఆయనతో ముంబైలో కొన్ని యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దీనిలో గ్రాఫిక్ వర్క్ చాలా ఉంటుంది కనుక యుద్ధ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ సెట్స్‌లో షూట్ చేస్తున్నారు.
రామాయణ మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల చేస్తామని దర్శకుడు నితీష్ తివారీ ముందే ప్రకటించారు.