
జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధానపాత్ర చేసిన దృశ్యం సినిమా 2013లో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. దానిని తెలుగుతో సహా ఆరు భాషల్లో రీమేక్ చేస్తే అన్నీ భాషల్లో ఆ సినిమా హిట్ అయ్యింది. దానికి సీక్వెల్‌గా మళ్ళీ మలయాళంలో దృశ్యం-2 తీస్తే, మళ్ళీ అని భాషల్లో దానిని రీమేక్ చేశారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది. కనుక దృశ్యం-3 ఉంటుందని దర్శకుడు జీతూ జోసెఫ్ అప్పుడే ప్రకటించారు.
చెప్పిననట్లుగానే దృశ్యం-3 స్క్రిప్ట్ సిద్దమైందని నటుడు మోహన్ లాల్ ప్రకటించారు. ‘గతం ఎప్పటికీ నిశబ్ధంగా ఉండదు’ అంటూ దృశ్యం-3 సినిమాలో ఏం జరుగబోతోందో చిన్న క్లూ కూడా ఇచ్చారు.
పూర్తి స్క్రిప్ట్ చేతిలో లేకుండా షూటింగ్ మొదలుపెట్టే అలవాటు దర్శకుడు జీతూ జోసెఫ్‌కి లేదు. ఇప్పుడు స్క్రిప్ట్ సిద్దంగా ఉంది కనుక త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి 3-4 నెలల్లో ఆ పనులు పూర్తయితే జూలై-ఆగస్ట్ నెలల్లో దృశ్యం3 షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది.