
తన అందాలతో అలరించిన మిల్కీ బ్యూటీ తమన్నా స్థానంలోకి అనేకమంది కొత్త హీరోయిన్లు వచ్చేయడంతో ఆమె సినిమాలు తగ్గాయి. మళ్ళీ చాలా కాలం తర్వాత అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల-2 చేస్తున్నారు. ఈ సినిమాలో ఆమె శివశక్తి సాధువుగా నటిస్తున్నారు.
ఈరోజు వారణాశిలో ఓదెల-2 టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే ఓదెల-2 కూడా సూపర్ హిట్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. 2022 లో విడుదలైన ఓదెల రైల్వే స్టేషన్‌కు సీక్వెల్‌గా ఓదెల-2 తీస్తున్నారు.
ఈ సినిమాలో హర్ష పాటేల్, వశిష్ట ఎన్ సింహా, యువ, నాగ మహేష్, వంశీ,గగన్ విహారీ, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ: సంపత్ నంది, సంగీతం: అజనీష్ లోక్‌నాధ్, కెమెరా: సౌందర రాజ్యం, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. ఈ సినిమాని మధూ క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్లపై డి.మధు పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోందని టీజర్‌లో ప్రకటించారు.