
రామ్ జగదీష్ దర్శకత్వంలో మార్చి 14న వస్తున్న సినిమా పేరు కోర్టు. సబ్ టైటిల్: ‘స్టేట్ వెర్సస్ నో బడీ.’ హర్ష రోషన్, శ్రీదేవి జంటగా చేస్తున్న ఈ సినిమాలో ప్రియదర్శి తొలిసారిగా న్యాయవాదిగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో శివాజీ, సాయి కుమార్, హర్ష వర్ధన్, రోహిణి, శుభలేఖ సుధాకర్, సురభి ప్రభావతి, రాజశేఖర్ ఆనింగి ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమా నుంచి ప్రేమలో అంటూ సాగే తొలిపాట విడుదలైంది. పూర్ణాచారి వ్రాసిన ఈ పాటని విజయ్ బుల్గనీన్ స్వరపరిచి సంగీతం అందించగా అనురాగ్ కులకర్ణి, సమీర భరద్వాజ్ ఆలపించారు.
శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ సినిమా తొలి ప్రెస్‌మీట్ నిర్వహిస్తామని తెలియజేస్తూ వెరైటీగా ఓ పోస్టర్ వేశారు.
ఈ సినిమాకు సంగీతం: విజయ్ బుల్గనీన్, కొరియోగ్రఫీ: ఈశ్వర్ పెంటి, కెమెరా: దినేష్ పురుషోత్తమన్, స్క్రీన్ ప్లే: రామ్ జగదీష్. కార్తికేయ శ్రీనివాస్, వంశీధర్ శ్రీగిరి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, ఆర్ట్: విఠల్ చేస్తున్నారు.
సహజ నటుడు నాని సమర్పణలో వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపాఠి ఈ సినిమా నిర్మిస్తున్నారు. మార్చి 14న విడుదల కాబోతోంది.