
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేయబోతున్నానంటూ ఆ మద్య ప్రశాంత్ వర్మ పోస్టులు పెట్టారు. కానీ ఆ తర్వాత అందరూ సైలంట్ అయిపోయారు. ప్రశాంత్ వర్మ షరతులు, బాలయ్య కోరికలు మ్యాచ్ అవకపోవడంతో మోక్షజ్ఞ సినిమా అటకెక్కిపోయిందని పుకార్లు వచ్చాయి. కానీ అటువంటిదేమీ లేదని, మోక్షజ్ఞని తానే హీరోగా పరిచయం చేస్తానని ప్రశాంత్ వర్మ చెప్పి ఆ పుకార్లు, ఊహాగానాలకు చెక్ పెట్టారు.
కానీ ఇంతవరకు మోక్షజ్ఞతో సినిమా మొదలుపెట్టకపోవడంతో మళ్ళీ పుకార్లు మొదలయ్యాయి. కనుక మళ్ళీ ప్రశాంత్ వర్మ స్పందిస్తూ, ప్రస్తుతం తాను జై హనుమాన్ సినిమా షూటింగ్‌తో చాలా బిజీగా ఉన్నానని అది పూర్తవగానే మోక్షజ్ఞతో సినిమా మొదలుపెడతానని చెప్పారు. ఆలోగా మోక్షజ్ఞ గుర్రపుస్వారీ, డాన్స్ శిక్షణ తీసుకోవాలని సూచించానని ప్రశాంత్ వర్మ చెప్పారు.
కనుక ప్రశాంత్ ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతోంది కానీ అటకెక్కిపోలేదని స్పష్టమయ్యింది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న బాలయ్య అభిమానులకు ఇది సంతోషం కలిగించినా, ఈ ఏడాదిలో వారి ప్రాజెక్ట్ మొదలవదు కనుక కాస్త నిరాశ తప్పదు.