దిల్‌రుబాతో కిరణ్ అబ్బవరం రొమాంటిక్ సాంగ్‌

విశ్వకరుణ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం, రుక్సర్ ధిల్లాన్ జంటగా చేస్తున్న దిల్‌రుబా వాలంటైన్ డే సందర్భంగా ఈ నెల 14న విడుదల కావలసి ఉండగా అనివార్య కారణాల వలన మార్చి 14 కి వాయిదా పడింది. ఈ సినిమా నుంచి ‘హే జింగిలి..’ అంటూ హీరో హీరోయిన్ల మద్య సాగే రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. భాస్కర భట్ల వ్రాసిన ఈ పాటని శామ్ సిఎస్ స్వరపరిచి స్వయంగా పాడారు.

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: విశ్వకరుణ్, సంగీతం: శామ్ సిఎస్, కెమెరా: డానియల్ విశ్వాస్, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేస్తున్నారు.   

శివం సెల్యులాయిడ్స్ సమర్పణలో యూడ్లీ ఫిల్మ్ బ్యానర్‌పై ప్రముఖ మ్యూజిక్ కంపెనీ సరేగమతో కలిసి రవి, జోజో రోజ్, రాకేశ్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నారు.