
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ జీవితగాధ ఆధారంగా రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాత్రలో రిషబ్ శెట్టి ఫస్ట్-లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఓ కొండ గుహలో అమ్మవారి విగ్రహం ఎదుట ఛత్రపతి శివాజీ ఖడ్గం పట్టుకుని నిలబడిన పోస్టర్ చాలా ఆకట్టుకుంటోంది.
సందీప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2027, జనవరి 21 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, పనిచేయబోయే సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.
రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతారా: చాప్టర్-2 చేస్తున్నారు. ప్రశాంత్ వర్మ తీస్తున్న ‘జై హనుమాన్’ సినిమాలో హనుమంతుడిగా నటిస్తున్నారు. వాటిలో కాంతారా చాప్టర్-2 ఈ ఏడాదిలోనే విడుదల కాబోతోంది. జైహనుమాన్ 2026లో విడుదల కాబోతోంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ 2027లో విడుదల కాబోతోంది. అంటే ఏడాదికి ఒకటి చొప్పున రిషబ్ శెట్టి సినిమాలు వరుసగా విడుదలకాబోతున్నాయన్న మాట!