
పెద్ద హీరోల బారీ బడ్జెట్ సినిమాలని అందరూ ఫాలో అవుతుంటారు. కానీ మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు హిట్ అయితే తప్ప ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కనుక అనేక చిన్న సినిమాలు వస్తుంటాయి.. ఎవరికీ తెలియకుండానే వెళ్ళిపోతుంటాయి. కనుక కంటెంట్ ఉన్న చిన్న సినిమాలని కూడా ప్రేక్షకులు ఆదరిస్తే మరిన్ని చక్కటి సినిమాలు వస్తాయి.
తాజాగా ధనరాజ్ నటించి దర్శకత్వం వహించిన సినిమా రామం.. రాఘవం ట్రైలర్ ఈరోజు విడుదలైంది. ప్రతీ ఇంట్లో తండ్రీ కొడుకుల మద్య జరిగే మానసిక ఘర్షణని సినిమాగా తెరకెక్కించారు ధనరాజ్. . కనుక ఈ సినిమా ఎలా ఉంటుందో ట్రైలర్ చూసి ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు.
ఈ సినిమాలో ధనరాజ్ తండ్రిగా సముద్రఖని నటించారు. హర్షిత ఉత్తమన్, సత్య, శ్రీనివాస రెడ్డి, పృధ్వీరాజ్, మోక్షసేన్ గుప్తా, ప్రమోదీని తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకు సంగీతం: అరుణ్ చిలువేరు, కెమెరా: దుర్గా ప్రసాద్ కొల్లి, కొరియోగ్రఫీ: జీతూ, ఎడిటింగ్: మార్తాండ్ కే వెంకటేష్, ఆర్ట్: దవులూరి నారాయణ, ఫైట్స్: నటరాజ చేశారు.
స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్‌పై పృధ్వీ పొలవరపు నిర్మించిన ఈ సినిమాని ఈ నెల 21న తెలుగు, తమిళ్ భాషలలొ విడుదల కాబోతోంది.