
గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ 109వ సినిమాకి ‘డాకూ మహరాజ్’ అని పేరు ప్రకటించారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లో సినిమా టైటిల్ ప్రకటించి, టైటిల్ టీజర్ విడుదల చేశారు.
“ఈ కధ వెలుగులు పంచే దేవుళ్ళది కాదు. చీకటిని శాశించే రాక్షసులది కాదు. ఆ రాక్షసులను ఆడించే రావణుడిది కాదు. ఈ కధ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఓ రాజుది. గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది. మరణాన్నే వణికించిన మహారాజుది... అంటూ బాలకృష్ణ గురించి పరిచయం చేసిన తర్వాత బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో “పైచానా ముజే... డాకూ... డాకూ మహారాజ్..” అంటూ బాలకృష్ణని చూపించడం అభిమానులను ఉర్రూతలూగిస్తుంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, శ్రద్ద శ్రీనాధ్, ప్రజ్ఞా జైస్వాల్, చాందినీ చౌదరీ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు కధ, దర్శకత్వం: బాబీ కొల్లి, స్క్రీన్ ప్లే: కె.చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు: సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే, స్టంట్స్: వి వెంకట్ చేస్తున్నారు.
ఈ సినిమాను శ్రీకార స్టూడియోస్ సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు ముందు జనవరిలో 12న ఈ సినిమా విదుదల కాబోతోంది.