రాబిన్‌హుడ్ టీజర్‌... కొత్తగా ఏముందబ్బా?

వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, శ్రీలీల జంటగా చేస్తున్న ‘రాబిన్‌హుడ్’ టీజర్‌ ఈరోజు సాయంత్రం విడుదలైంది.

అయితే ఇదివరకు విడుదల చేసిన ఫస్ట్-ఫస్ట్-లుక్ పోస్టర్‌ వగైరాలతో క్రియేట్ చేసిన హైప్‌కి తగ్గట్లు టీజర్‌ లేదనిపించింది. వాటిని చూసిన తర్వాత టీజర్‌ మరో లెవెల్లో ఉంటుందనుకుంటే రొటీన్‌గానే అనిపిస్తుంది. కానీ టీజర్‌ చూసి ఏ సినిమాని అంచనా వేయకూడదు కనుక డిసెంబర్‌ 25న వస్తున్న రాబిన్‌హుడ్ ప్రేక్షకులని నిరాశపరచడనే ఆశిద్దాం. 

ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు. ఇంతవరకు సినిమా ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై కాస్త గందరగోళం ఉండేది. కానీ డిసెంబర్‌ 25న క్రిస్మస్ పండుగకి శాంటాక్లాజ్‌తో పాటు రాబిన్‌హుడ్ వచ్చేస్తున్నాడని టీజర్‌లో చెప్పేశారు.