
సత్యదేవ్, డాలీ ధనుంజయ ప్రధాన పాత్రలలో ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ‘జీబ్రా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ మెగాస్టార్ చిరంజీవి సమక్షంలో నిన్న హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది.
సల్మాన్ దుల్కర్ తాజా సినిమా ‘లక్కీ భాస్కర్’ డబ్బు గురించే. జీబ్రా కూడా డబ్బు గురించే. త్వరలో విడుదల కాబోతున్న శేఖర్ కమ్ముల చిత్రం కుబేరా కూడా డబ్బు గురించే కావడం విశేషం. లక్కీ భాస్కర్ నిర్మాతలకి కనకవర్షం కురిపిస్తోంది. మరి జీబ్రా కూడా నిర్మాతలకు కనక వర్షం కురిపిస్తుందో లేదో నవంబర్ 22న సినిమా విడుదలైతే తెలుస్తుంది.
ఈ సినిమా ట్రైలర్ చూస్తే జీబ్రా తప్పకుండా సూపర్ హిట్ అవుతుందనిపిస్తుంది. అంతా అద్భుతంగా ఉంది.
ఈ సినిమాలో సునీల్, సత్యరాజ్, ప్రియా భవానీ శంకర్, సత్య, జెనిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: ఈశ్వర్ కార్తీక్, డైలాగ్స్: మీరక్, సంగీతం: రవి బస్రూర్, కెమెరా: సత్యా పొన్మార్, కొరియోగ్రఫీ: బాబా బాస్కర్, ఆర్కే, స్టంట్స్: రాబిన్హుడ్ సుబ్బు, ఎడిటింగ్: అనిల్ క్రిష్ చేశారు.
ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మజా ఫిలిమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై ఎస్న్ రెడ్డి, ఎస్ పద్మ, సుందరం, దినేష్ సుందరం కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.