
గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ-బాబి కాంబినేషన్లో 109వ సినిమాని జనవరిలో సంక్రాంతికి విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకొని శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఈ నెల 15వ తేదీ ఉదయం 10.24 గంటలకు ఈ సినిమా టైటిల్.. టీజర్ విడుదల చేయబోతున్నట్లు ఈరోజు ట్విట్టర్లో వెల్లడిస్తూ బాలకృష్ణ పోస్టర్ విడుదల చేశారు. దానిలో వెనుక వైపు నుంచి బాలకృష్ణని చూపినా గెటప్ బాగుంది.
ఈ సినిమాని ప్రారంభించినప్పుడే ‘ఓ గొడ్డలి దానిపై కళ్ళద్దాలు, దానిలో పోరాడుకొంటున్న ఇద్దరు వ్యక్తుల ప్రతిబింబాన్ని చూపుతూ, “బ్లడ్ బాత్ కా బ్రాండ్ నేమ్’, ‘వయొలెన్స్ కా విజిటింగ్ కార్డ్’ #ఎన్బికె109 షూటింగ్ ప్రారంభం” అంటూ ఈ సినిమా ఏవిదంగా ఉండబోతోందో పరిచయం చేశారు. తాజా పోస్టర్ కూడా అలాగే ఉంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ఊర్వశీ రౌతేలా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య కలిసి నిర్మిస్తున్నారు.