నవంబర్‌ 15న కుబేర ఫస్ట్ గ్లిమ్స్‌

శేఖర్ కమ్ముల, నాగార్జున, ధనుష్, రష్మిక మందన ఈ నాలుగు పేర్లు చాలు ఏ సినిమా అయినా ఆడేందుకు. కనుక వారు నలుగురు కలిసి చేస్తున్న పాన్ ఇండియా మూవీ ‘కుబేర’ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్ గ్లిమ్స్‌ ఈనెల 15వ తేదీన విడుదల కాబోతోంది. ఓ బహుళ అంతస్తుల భవనంలో సోఫాలో కూర్చొని నాగార్జున దేని గురించో ఆలోచిస్తున్నట్లున్న పోస్టర్‌ ఒకటి విడుదల చేశారు. 

ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.