పుష్ప-2 ట్రైలర్‌ రిలీజ్... బిహార్‌లో!

రామ్ చరణ్‌ హీరోగా చేస్తున్న ‘గేమ్ ఛేంజర్‌’ టీజర్‌ని ఈ నెల 9న ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో విడుదల చేయగా, అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్‌ సినిమా పుష్ప-2 ట్రైలర్‌ని బిహార్‌ రాజధాని పాట్నాలో విడుదల చేయబోతున్నారు. ఈ నెల 17వ తేదీ సాయంత్రం 6.03 గంటలకు పాట్నాలో (హిందీ వెర్షన్) ట్రైలర్‌ విడుదల చేయబోతున్నట్లు పుష్ప-2 టీమ్‌ వెల్లడిస్తూ మరో పోస్టర్‌ విడుదల చేసింది. రెండు సినిమాలు పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు కనుక హిందీ రాష్ట్రాలలో తమ సినిమాలు ప్రమోట్ చేసి ఉత్తరాది ప్రజలను ఆకర్షించేందుకు కొత్తగా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. 

పుష్ప-2లో ఈ ఏడాది డిసెంబర్‌ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుండగా, గేమ్ ఛేంజర్‌ జనవరి 10వ తేదీన విడుదల కాబోతోంది. రెండూ మెగా హీరోలు చేస్తున్న పాన్ ఇండియా మూవీలే కనుక రెంటిపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి.    

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మించిన పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేశారు.  

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr"><a href="https://twitter.com/hashtag/Pushpa2TheRule?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#Pushpa2TheRule</a> Trailer out on November 17th at 6:03 PM in Patna! <a href="https://t.co/cvj9NL6nmR">pic.twitter.com/cvj9NL6nmR</a></p>&mdash; Allu Arjun (@alluarjun) <a href="https://twitter.com/alluarjun/status/1855921949194768426?ref_src=twsrc%5Etfw">November 11, 2024</a></blockquote> <script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>