మా సినిమాని దెబ్బ తీస్తే వాళ్ళకేమి ఆనందమో?

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. వారు ఆ సినిమా టైటిల్‌ ఇంకా వెల్లడించక ముందే ఎవరో దానిని మీడియాకి లీక్ చేశారు.  శ్రీకాంత్ ఓదెల స్పందిస్తూ, “మా సినిమా టైటిల్‌ ఎవరు లీక్ చేశారో మాకు తెలుసు. మరొకరి సినిమా సమాచారం లీక్ చేసి వారేమీ ఆనందంపొందుతారో నాకు తెలీదు కానీ ఇది మంచి పద్దతి కాదు.

ఇకనైనా ఈవిదంగా ఇతరుల సినిమాలను దెబ్బతీయాలనే ఆలోచనలు మానుకోవాలని వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. సినిమా టైటిల్‌ లీక్ చేసి మళ్ళీ మా బృందంలో వారినే వేలెత్తి చూపడం సరికాదు. మా బృందంలో అందరూ సినీ రంగంలో తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకోవాలని తపిస్తూ ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. వారు ఇలాంటి చవుకబారు పనులు వారు పనిచేయరు,” అని అన్నారు. 

శ్రీకాంత్ ఓదెల... నానితో చేసిన మొదటి సినిమా ‘దసరా’ తోనే మంచి దర్శకుడిగా గుర్తింపు పొందారు. ఆ సినిమా సూపర్ హిట్ మంచి కలక్షన్స్‌ కూడా సాధించడంతో, మళ్ళీ నానితో చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ లీక్‌పై స్పందిస్తూ శ్రీకాంత్ ఓదెల చేసిన ట్వీట్‌లో వారి సినిమా పేరు ‘ది ప్యారడైజ్’ అని ఖరారు చేసిన్నట్లయింది. 

ఈ సినిమాలో నానికి జంటగా జాన్వీ కపూర్‌ నటిస్తోంది. ఈ సినిమా పూజా కార్యక్రమం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్‌ 12వ తేదీన జరిగింది.