
పుష్ప-2 సినిమాలో శ్రీలీల ఐటెమ్ సాంగ్ చేస్తోందని ఇప్పటికే అందరికీ తెలుసు. ఐటెమ్ సాంగ్ డ్రెస్సులో శ్రీలీల-అల్లు అర్జున్ ఫోటో కూడా మొన్న లీక్ అయ్యింది. ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదామని అనుకున్నారో ఏమో ఆదివారం పుష్ప-2 టీమ్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీలకి స్వాగతం అంటూ పోస్టర్ విడుదల చేసింది. దానిలో మొన్న లీక్ అయిన ఫోటోలో ఉన్న డ్రెస్‌తోనే ఉంది. శ్రీలీలని పరిచయం చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. కానీ పాట ఎప్పుడు విడుదల చేస్తారో ప్రకటించకుండా సస్పెన్స్ మెయింటెన్ చేస్తున్నారు.
సుకుమార్ దర్శకత్వంలో డిసెంబర్ 5వ తేదీన వస్తున్న ‘పుష్ప-2 సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటించగా, ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతిబాబు ముఖ్య పాత్రలు చేశారు.
పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్న నిర్మిస్తున్నాయి.