కుబేర టీజర్‌..నవంబర్‌ 15న

రెండు మూడేళ్ళకోసారి వచ్చే శేఖర్ కమ్ముల సినిమా అంటే చాలా ప్రత్యేకం. తాజాగా అక్కినేని నాగార్జున, కోలీవుడ్‌ నటుడు ధనుష్ ప్రధాన పాత్రలలో ‘కుబేర’ సినిమా తీస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ వగైరా సినిమాపై చాలా ఆసక్తి రేపుతున్నాయి.

తాజాగా దీపావళి కానుకగా మరో పోస్టర్‌ విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన కార్తీక పూర్ణిమ రోజున టీజర్‌ విడుదల చేస్తామని కుబేరా టీమ్‌ ప్రకటించింది  

కుబేరా సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. బహుశః జనవరిలో సంక్రాంతి పండుగకు విడుదలయ్యే అవకాశం ఉంది.