
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ 47వ సినిమాగా రణమండల అనే సినిమా తీయబోతోంది. ఈ సినిమాకి సంబందించి ఓ అద్భుతమైన మోషన్ పోస్టర్ విడుదల చేసింది. కర్నూలు జిల్లాలోని అదోని పట్టణంలో శ్రీ రణమండల వీరాంజనేయస్వామివారి ఆలయం ఉంది.
రెండు కొండలపై నిర్మించిన ఈ ఆలయానికి యాదాద్రి శ్రీ వీరాంజనీయ భైరవ దేవస్వామి, యాదవగిరి శ్రీ వీరాంజనీయ భైరవ దేవస్వామి అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చారిత్రిక ప్రాధాన్యం కలిగిన, చాలా ప్రసిద్ధి చెందిన ఆలయాలలో ఇది కూడా ఒకటి. అత్యంత మహిన్వితమైన ఆంజనేయస్వామివారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల జిల్లాలు, రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.
కనుక రణమండల హనుమాన్ పేరుతోనే ఈ సినిమా నిర్మిస్తున్నట్లు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. ఈ ఆలయంలోనే ఈ సినిమా పూజాకార్యక్రమం చేసిన తర్వాత మోషన్ పోస్టర్ విడుదల చేశారు. రణమండల సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నామని టీజీ విశ్వప్రసాద్ చెప్పారు. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు.