అమెజాన్ ప్రైమ్‌లోకి గోపీ చంద్‌ విశ్వం!

థియేటర్లలోకి వచ్చిన సినిమాలు ఓటీటీలోకి రాకతప్పదనేది నేటి నానుడి. శ్రీను వైట్ల, గోపీ చంద్‌ కాంబినేషన్‌లో ఈ నెల 11న థియేటర్లలోకి వచ్చిన ‘విశ్వం’ సినిమా కాస్త పాజిటివ్ టాక్ దక్కించుకొని, కలక్షన్స్‌, బ్రేక్ ఈవెన్ సాధించి ఒడ్డున పడింది. కనుక ఇప్పుడు ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. దీపావళి పండుగకి కొత్త సినిమాలు ఓటీటీలోకి వస్తుంటాయి కనుక విశ్వం కూడా నవంబర్‌ 1వ తేదీన అమెజాన్ ప్రైమ్‌లోకి రాబోతోందని తెలుస్తోంది. కానీ ఈ విషయం ఇంకా అమెజాన్ ప్రైమ్‌ ధృవీకరించాల్సి ఉంది. 

ఈ సినిమాలో గోపీ చంద్‌కి జోడీగా కావ్యా ధాపర్ నటించగా నరేష్, ప్రగతి, వెన్నెల కిషోర్, శ్రీకాంత్ అయ్యంగార్, రాహుల్ రామకృష్ణ, పృధ్వీ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.    

ఈ సినిమాకి కధ: గోపీ మోహన్, భాను- నాయుడు, ప్రవీణ్ వర్మ, స్క్రీన్ ప్లే: గోపీ మోహన్, సంగీతం: చైతన్ భరద్వాజ్, కెమెరా: కేవీ గుహన్, స్టంట్స్‌: రవి వర్మ, దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: అమర్ రెడ్డి కుడుముల, ఆర్ట్: కిరణ్ కుమార్‌ మన్నే చేశారు.  

దోనెపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్ , వేణుస్వామి దోనెపూడి కలిసి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మించారు.