ఎస్ఎస్‌ఎంబీ29 వర్కింగ్ టైటిల్‌తో మహేష్ బాబు-రాజమౌళిల సినిమా షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కాబోతోందని ఈ సినిమాకి కధ అందించిన విజయేంద్రప్రసాద్ చెప్పారు. అప్పటి నుంచి సినిమా విడుదలయ్యేవరకు అంటే సుమారు 4 సంవత్సరాల పాటు అంటే 2029 వరకు మహేష్ బాబు ఎవరికీ కనిపించరు. వేరే సినిమాలలో నటించరు. ఇది ఆయన అభిమానులు జీర్ణించుకోవడం కష్టమే.
బహుశః అందుకేనేమో మహేష్ బాబు వారికి ఓ చిన్న బహుమతి ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తన మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా వస్తున్న ‘దేవకీ నందన వాసుదేవ’ సినిమాలో మహేష్ బాబు శ్రీకృష్ణుడు పాత్రలో కొద్ది సేపు కనపడబోతున్నట్లు సమాచారం. కానీ ఈ వార్తని ఇంకా ధృవీకరించాల్సి ఉంది. అయితే ఇప్పటికే శ్రీకృష్ణుడు రూపంలో మహేష్ బాబు ఏఐ ఇమేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అర్జున్ జంద్యాల దర్శకత్వం వస్తున్న దేవకీ నందన వాసుదేవ సినిమాలో హీరోయిన్‌గా వారణాసి మానస చేస్తోంది.
ఈ సినిమాకు డైలాగ్స్: బుర్రా సాయి మాధవ్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: ప్రసాద్ మూరెళ్ళ, రసూల్ ఎల్లోర్; ఎడిటింగ్: తమ్మిరాజు, ఆర్ట్: జీఎం శేఖర్, లలితాంబిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 14వ తేదీన విడుదల కాబోతోంది.