నాగబాబు ముద్దుల కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యలు 2020, డిసెంబర్‌లో ఉదయ్ పూర్ కోటలో ఘనంగా వివాహం చేసుకొన్నారు. ఆ తర్వాత చిలకా గోరింకల్లా విదేశాలకు వెళ్ళి వచ్చారు. కానీ కొంతకాలం నుంచి వారిరువురూ వేర్వేరుగా ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం నిహారిక తమ తన సోషల్ మీడియా అకౌంట్ లోంచి భర్త చైతన్య ఫోటోలు చెరిపేయడంతో వారి మద్య దూరం పెరిగిందని స్పష్టమైంది.
వారిరువురూ కూకట్‌పల్లి ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేసుకోగా గత నెల 5వ తేదీనే వారికి కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయం కాస్త ఆలస్యంగా బయటపడింది. నిహారిక, చైతన్య ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకొన్నారు. చైతన్య టండీ గుంటూరు రేంజ్ ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర రావు కుమారుడు. నీహారికను ప్రేమించి పెళ్ళి చేసుకొన్నప్పటికీ రెండేళ్ళలోనే వారి మద్య విభేదాలు వచ్చి చివరికి విడాకులు తీసుకొన్నారు.