సంబంధిత వార్తలు

కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా చేస్తున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ నుంచి రెండో లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. జిగితార అంటూ సాగే అనంత శ్రీరాం వ్రాసిన ఈ పాటకి మణిశర్మ సంగీతం అందించగా కార్తీక్ పాడారు.
చెన్నై లవ్ స్టోరీకి స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రవికుమార్ నంబూరి, కధ: సాయి రాజేష్, సంగీతం: మణిశర్మ, కెమెరా: విశ్వాస డేనియల్ చేస్తున్నారు.
మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్ బ్యానర్లపై సాయి రాజేష్, ఎస్కెఎన్, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మిస్తున్న చెన్నై లవ్ స్టోరీ వచ్చే నెలలో విడుదల కాబోతోంది.