సంబంధిత వార్తలు

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల డైరక్షన్ లో వచ్చిన సినిమా నారప్ప. కోలీవుడ్ లో సూపర్ హిట్టైన అసురన్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో వెంకటేష్, ప్రియమణి నటించారు. ఈ నెల 20న డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ఓటిటి రిలీజ్ పై వెంకటేష్ అభిమానులకు క్షమించమని చెప్పారు. వారిని దృష్టిలో ఉంచుకునే సినిమా ఓటిటిలో రిలీజ్ చేస్తున్నామని అన్నారు.
నారప్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మా ఎలక్షన్స్ పై కూడా స్పందించారు వెంకటేష్. మా ఎలక్షన్స్ గొడవలపై మన చేతుల్లో ఏదు లేదు.. అంతా మంచి జరగాలని అన్నారు. అంతేకాదు గొడవలు కూడా శాశ్వతం కాదని అన్నారు వెంకటేష్.