
రాజమౌళి తెరకెక్కిస్తున్న RRR సినిమా నుండి మేకింగ్ వీడియో రోర్ ఆఫ్ RRR రిలీజ్ చేశారు. సినిమా మేకింగ్ వీడియోతోనే వారెవా అనిపించేశాడు రాజమౌళి. బాహుబలి తర్వాత ఆ సినిమా స్థాయికి ఏమాత్రం తగ్గకుండా మరో భారీ సినిమా చేస్తున్నారు రాజమౌళి. సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు సూపర్ హీరోస్ నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. 1920 ల కాలం నాటి కథతో ఫిక్షనల్ స్టోరీగా RRR తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నటిస్తున్నారు.
మేకింగ్ వీడియో చూస్తే రాజమౌళి మరో అద్భుతాన్ని సృష్టిస్తున్నాడని మాత్రం అర్ధమవుతుంది. అంతేకాదు కొన్నాళ్లుగా కన్ఫ్యూజన్ లో ఉన్న సినిమా రిలీజ్ డేట్ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. సినిమాను ముందు అనుకున్నట్టుగానే అక్టోబర్ 13న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.