నారప్ప ట్రైలర్.. సేమ్ టూ సేమ్ దించేశారుగా..!

కోలీవుడ్ లో సూపర్ హిట్టైన ధనుష్ అసురన్ సినిమాను తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు నారప్ప టైటిల్ ఫిక్స్ చేశారు. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమలో వెంకటేష్ కు జోడీగా ప్రియమణి నటించింది. జూలై 20న అమేజాన్ ప్రైం లో ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతుంది. లేటెస్ట్ గా ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

అసురన్ సినిమాను మక్కీకి మక్కీ దించేశాడు శ్రీకాంత్ అడ్డాల. ఇక ట్రైలర్ విషయానికి వస్తే మాస్ లుక్ లో వెంకటేష్ అదరగొట్టారు. సినిమాలో యాక్షన్ సీన్స్ లో కూడా వెంకటేష్ దుమ్ముదులిపేశాడని అనిపిస్తుంది. కుల వ్యవస్థ, భూ వివాదం వంటి సామాజిక అంశాలతో ఈ సినిమా తెరకెక్కింది. ట్రైలర్ అంచనాలను పెంచగా సినిమా ఆశించిన స్థాయిలో ఉంటుందో లేదో చూడాలి.