శంకర్ సినిమాకు డైలాగ్ రైటర్ అతనే..!

శంకర్, రాం చరణ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో సినిమా రాబోతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఉండబోతుందని తెలుస్తుంది. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాలో డైలాగ్ రైటర్ గా సాయి మాధవ్ బుర్రకి ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. తన పదునైన మాటలతో సన్నివేశాలకు బలాన్ని ఇస్తున్న సాయి మాధవ్ మాటలు సినిమాకు ఎంతో ప్లస్ అవుతున్నాయి. రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాకు కూడా సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు.   

ఇప్పుడు శంకర్, చరణ్ కాంబో సినిమాకు కూడా ఆయన మాటలు అందిస్తారని తెలుస్తుంది. ఈ ఛాన్స్ అందుకోగానే ఒకప్పుడు తాను శంకర్ సర్ ని కలిస్తే చాలని అనుకున్నా కాని ఇప్పుడు ఆయన సినిమాకు మాటలు రాసే అవకాశం దొరికిందని తన సంతోషాన్ని వెల్లడించారు సాయి మాధవ్ బుర్ర. ఆర్.ఆర్.ఆర్ కు డైలాగ్స్ చాలా స్పెషల్ గా ఉంటాయని తెలుస్తుంది. అదేవిధంగా శంకర్, చరణ్ సినిమాకు ఆయన డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణ అవుతాయని చెప్పొచ్చు.