
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో రామ్ సరసన ఉప్పెన భామ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని తెలుస్తుంది. పందెంకోడి, ఆవారా లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన లింగుసామి రామ్ తో చేస్తున్న ఈ బైలింగ్వల్ సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
ఇక లేటెస్ట్ గా ఈ సినిమాలో విలన్ రోల్ లో తమిళ స్టార్ హీరో ఆర్యని తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. కోలీవుడ్ హీరో తన డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ కు సుపరిచితుడే అంతేకాదు డైరెక్ట్ గా కూడా వరుడు, వర్ణ సినిమాల్లో నటించాడు ఆర్య. ఇక ఇప్పుడు రామ్ కోసం మరోసారి విలన్ గా మారుతున్నాడు. మరి యువ హీరోలు ఇద్దరు రామ్ వర్సెస్ ఆర్య చేసే ఈ ఫైట్ ఎలా ఉండబోతుందో చూడాలి.