కింగ్ నాగార్జున ఓటీటీ సినిమా..?

కింగ్ నాగార్జున ఓటీటీ సినిమా చేయబోతున్నారు. నూతన దర్శకుడు చెప్పిన పాయింట్ నచ్చి ఓటీటీలో ప్రయోగం చేయాలని అనుకుంటున్నారట నాగ్. ఇక తన ఓటీటీ సినిమాపై స్పందించిన నాగార్జున ఈ ఫ్లాట్ ఫాం నాకు కొత్త ఓ ఐడియా ఉంది దాన్ని డెవలప్ చేయాల్సి ఉందని అన్నారు. అంతేకాదు సినిమాల్లో చేయలేని ప్రయత్నాలు ఓటీటీలో చేయొచ్చు. తను నెక్స్ట్ చేసేది కంప్లీట్ ఓటీటీ సినిమానే అని చెప్పేశారు నాగార్జున. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలోనే ఉందని పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని అన్నారు. సీనియర్ స్టార్ హీరోల్లో నాగార్జున ముందు ఓటీటీ బాట పడుతున్నారు.

రీసెంట్ గా నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ సినిమా అసలైతే ఓటీటీలో రిలీజ్ చేయాల్సి ఉన్నా థియేటర్లు ఓపెన్ అవడంతో ఓటీటీ డీల్ క్యాన్సల్ చేసుకుని మరి సినిమాను థియేట్రికల్ రిలీజ్ చేశారు. కాని సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. అందుకే ఈసారి డైరెక్ట్ ఓటీటీ మూవీ చేస్తున్నారు నాగార్జున. ఇక దీనితో పాటుగా ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు నాగార్జున.