అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ అదుర్స్..!

ఇన్నాళ్లు లవర్ బోయ్ గా కనిపించి అలరించిన అఖిల్ ఇక మీదట మాస్ హీరోగా కనిపించనున్నాడు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో అఖిల్ హీరోగా వస్తున్న యాక్షన్ మూవీ ఏజెంట్ కోసం అఖిల్ పూర్తిగా మాస్ హీరో కటౌట్ తెచ్చుకున్నాడు. లేటెస్ట్ సిక్స్ ప్యాక్ లుక్స్ తో అక్కినేని అఖిల్ వావ్ అనేలా చేస్తున్నాడు. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ ఏడాది నుండి వర్క్ అవుట్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇదే ఫోర్స్ సినిమా మొత్తం ఉంటుందని ప్రామిస్ చేస్తున్నాడు అఖిల్. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో మాస్ ఎంటర్టైనర్ గా ఏజెంట్ సినిమా వస్తుంది.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని టాక్. ప్రస్తుతం అఖిల్ నటించిన బ్యాచిలర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్దే హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో హిట్ ఖాతా తెరవాలని చూస్తున్నాడు అఖిల్.