'మా' ఎన్నిక ఏకగ్రీవమైతే.. నేను పోటీ నుండి తప్పుకుంటా..!

మూవీ ఆర్టిస్ట్ అసొసియేషన్ ఎన్నికల హంగామాలో భాగంగా మొన్నటివరకు పోటీలో నిలిచే ఐదుగురు సభ్యులు ఒకరిని మించి మరొకరు పోటీ పడి మరి ప్రెస్ మీట్లు పెట్టారు. సినీ పెద్దల జోక్యంతో ఇప్పుడు అందరు కొద్దిగా సైలెంట్ అయ్యారని అనిపిస్తుంది. ఈసారి మా ఎన్నికలకు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ, సివీఎల్ నరసిం హా రావు పోటీ పడుతున్నారు.  

లేటెస్ట్ గా మంచు విష్ణు ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. తన ఫ్యామిలీ మాకి ఏవిధంగా సపోర్ట్ గా ఉందో.. చెన్నై నుండి తెలుగు సినీ పరిశ్రమ ఎలా హైదరాబాద్ కు వచ్చింది అన్న విషయాలను ప్రస్థావిస్తూ మా బిల్డింగ్ కు ఇది వరకు మా ఫ్యామిలీ నుండి 25 శాతం ఇస్తామని చెప్పాము కాని ఇప్పుడు మా బిల్డింగ్ పూర్తి బాధ్యత మంచు ఫ్యామిలీదే అంటూ షాక్ ఇచ్చాడు మంచు విష్ణు. 

900 మంది ఉన్న మా సభ్యులంతా ఒకే కుటుంబని.. ఇదివరకు చేసి మా అధ్యక్షులంతా బాగా చేశారని కొన్ని తప్పులు జరిగినా అవి ఉద్దేశ పూర్వకంగా చేసి ఉండరని అన్నారు మంచు విష్ణు. సినీ పెద్దలంతా కలిసి ఏకగ్రీవంగా ఎంపిక జరిపితే తను పోటీ నుండి తప్పుకోవడానికి సిద్ధమే అని అన్నారు. ఫైనల్ గా మా అధ్యక్షుడిగా తనని ఆశీర్వదించాలని కోరారు. మొత్తానికి మంచు విష్ణు వీడియో పరిశ్రమ పెద్దలను కూడా కన్ ఫ్యూజన్ లో పడేసిందని చెప్పొచ్చు.