
నాచురల్ స్టార్ నాని కెరియర్ లో జెర్సీ సినిమా సంథింగ్ స్పెషల్ అని చెప్పొచ్చు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను హిందీలో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్నారు. హిందీ జెర్సీ సినిమాను కూడా గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటం విశేషం. ఇదిలాఉంటే మరోసారి గౌతం తిన్ననూరి నానితో సినిమా చేస్తారని తెలుస్తుంది. నాని జెర్సీ కాంబో మళ్లీ రిపీట్ అవబోతుంది.
నాని ప్రస్తుతం టక్ జగదీష్ ను పూర్తి చేశాడు. ఆ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయాల్సి ఉంది. ఇక మరోపక్క శ్యామ్ సింగ రాయ్ సెట్స్ మీద ఉంది. రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాతో పాటుగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో అంటే సుందరానికీ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత నాని గౌతం తిన్ననూరి సినిమా చేస్తాడని తెలుస్తుంది. మరి జెర్సీ కాంబో సినిమా ఈసారి ఎలాంటి కాన్సెప్ట్ తో వస్తారో చూడాలి.