రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ'..!

క్రాక్ తర్వాత దూకుడు పెంచిన మాస్ మహ రాజ్ రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాలో నటించారు. ఆ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ శరత్ మండవ డైరక్షన్ లో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు టైటిల్ గా రామారావు ఆన్ డ్యూటీ అని పెట్టారు. సినిమాకు సంబందించిన రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమాలో రామారావు పాత్రలో రవితేజ ఎమ్మార్వోగా కనిపిస్తారని తెలుస్తుంది.

రియల్ స్టోరీ బేస్ చేసుకుని డైరక్టర్ శరత్ మండవ ఈ సినిమా కథ రాసుకున్నారని తెలుస్తుంది. అసలైతే రామారావు టైటిల్ తో బాలకృష్ణ సినిమా చేయాలని అనుకున్నారు. అనీల్ రావిపుడి డైరక్షన్ లో బాలయ్య బాబు హీరోగా చేసే సినిమాకు రామారావు అని పెట్టాలని అనుకున్నారు కాని ఈలోగా రవితేజ సినిమాకు రామారావు అని ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తుంది.