లెజెండ్ 'దాదా సాహెబ్ ఫాల్కే' అవార్డ్ అందుకున్న సుమన్..!

సీనియర్ నటుడు సుమన్ కు అత్యంత ప్రతిష్టాత్మక అవార్డ్ లెజెండ్ దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించింది. భారతీయ సినీ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ 2021 పురస్కారం దక్షిణాది నుండి సుమన్ కు అందించారు. దాదా సాహెబ్ మనవడు చంద్రశేఖర్ ఈ అవార్డ్ ను ప్రదానం చేశారు. హీరోగా, విలన్ గా సౌత్ భాషల్లో నటించిన సుమన్ ప్రస్తుతం క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకోవడం పట్ల సుమన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. నటుడిగా తన ఎదుగుదలకు సహకరించిన వారందరికి సుమన్ కృతజ్ఞతలు తెలిపారు.