గని ఫైనల్ షెడ్యూల్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా నటిస్తున్నాడు. సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ ను తీసుకొచ్చారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత గని షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇది సినిమా చివరి షెడ్యూల్ అని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ కోసం భారీ సెట్ ఏర్పరిచారని తెలుస్తుంది. అందులోనే ఈ చివరి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేస్తారని అంటున్నారు. 

గని సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ భామ సయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో కన్నడ స్టార్ ఉపేంద్ర నటిస్తున్నారు. వరుస సక్సెస్ లతో సూపర్ ఫాం లో ఉన్న వరుణ్ తేజ్ గనితో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.