రామ్ 19 టైటిల్ అదేనా..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుసామి డైరక్షన్ లో వస్తున్న సినిమా ఈ నెల 12 నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో రామ్ కు జోడీగా కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా వస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా ఉస్తాద్ అని అనుకుంటున్నారని ప్రచారంలో ఉంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా నుండి ఎనర్జిటిక్ స్టార్ కాస్త ఉస్తాద్ రామ్ పోతినేని అని స్క్రీన్ నేమ్ చేంజ్ చేసుకున్నాడు రామ్. ఇప్పుడు అదే టైటిల్ ని ఫిక్స్ చేయాలని చూస్తున్నాడు. 

ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాల బ్యాక్ టు బ్యాక్ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న రామ్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమాను తెలుగుతో పాటుగా తమిళంలో కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. రామ్ చేస్తున్న తొలి బైలింగ్వల్ మూవీగా కూడా ఈ సినిమా క్రేజ్ తెచ్చుకుంది.