
మళయాళ భామ అనుపమ పరమేశ్వరన్ ఓ పక్క సినిమాలు చేస్తూనే మరోపక సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ ను అలరిస్తుంది. ప్రతిరోజు సంథింగ్ స్పెషల్ అన్నట్టుగా తన ఫ్యాన్స్ ను ఆకట్టుకునేలా ఫోటో షూట్ చేసే అనుపమ అభిమానులతో చిట్ చాట్ చేయడంలో కూడా ముందు ఉంటుంది. ఈ క్రమంలో లేటెస్ట్ గా ఫాలోవర్స్ తో చాట్ చేసింది అనుపమ అందులో భాగంగా ఓ అభిమాని నిజమైన ప్రేమ అనుభూతిని పొందారా అని అడిగాడు. దానికి ఆన్సర్ గా అనుపమ షాకింగ్ రెస్పాన్స్ ఇచ్చింది. ఇంతకీ ఆమె ఏమని ఆన్సర్ ఇచ్చింది అంటే నిజమైన ప్రేమ అనుభూతి పొందాను.. నిజమైన బ్రేకప్ అనుభూతి పొందానని చెప్పింది.
అనుపమ ఇచ్చిన ఆన్సర్ కు ఫ్యాన్స్ షాక్ అయ్యారు. అంటే అనుపమ లవ్ ఫెయిల్యూర్ అని అర్ధమయ్యింది. ఓ హీరోయిన్ గా ఫాం లో ఉండి ఇలా తాను లవ్ ఫెయిల్యూర్ అని చెప్పడానికి గట్స్ ఉండాలి. అందం అభినయం రెండు ఉన్నా సరే అనుపమకి సరైన ఛాన్సులు రావట్లేదని చెప్పాలి. ప్రస్తుతం అనుపమ తెలుగులో నిఖిల్ నటిస్తున్న 18 పేజెస్, కార్తికేయ 2 సినిమాల్లో నటిస్తుంది.