కమల్ హాసన్ విక్రం ఫస్ట్ లుక్ అదుర్స్..!

కోలీవుడ్ లో మంచి ఫాం లో ఉన్న యువ దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం యూనివర్సల్ స్టార్.. లోకనాయకుడు కమల్ హాసన్ తో సినిమా చేస్తున్నాడు. విక్రం టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలో నటిస్తున్న ముగ్గురు విలక్షణ నటులు కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ తో ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. ముగ్గురు గెడ్డం లుక్ తో వదిలిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.

సినిమాను కమల్ హాసన్ ప్రొడక్షన్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. మా నగరం, ఖైదీ, మాస్టర్ సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న డైరక్టర్ లోకేష్ కనగరాజ్ కమల్ హాసన్ తో చేస్తున్న విక్రం సినిమా ఎలా ఉండబోతుందో అని ఫ్యాన్స్ ఎక్సయిటింగ్ గా ఉన్నారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం అంచనాలను భారీగా పెంచేసిందని చెప్పొచ్చు.