
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమా కరోనా సెకండ్ వేవ్ తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించింది. సినిమాకు సంబందించిన చివరి షెడ్యూల్ కాగా ఈ షెడ్యూల్ లో రాం చరణ్ మాత్రమే పాల్గొంటారని తెలుస్తుంది. సినిమా షూటింగ్ మొదలైందని చెబుతూ ధర్మస్థలి తలుపులు మళ్ళీ తెరచుకున్నాయి అంటూ ఆచార్యలోని సిద్ధ పాత్ర చేస్తున్న రాం చరణ్ లుక్ ను రిలీజ్ చేశారు.
సాలిడ్ గా ఉన్న సిద్ధ పోస్టర్ తో వచ్చిన ఆచార్య అప్డేట్ మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది. ఈ షెడ్యూల్ తో సినిమా పూర్తవుతుందని తెలుస్తుంది. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో వస్తున్న ఈ సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేస్తుండగా నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, పూజా హెగ్దే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని లాహే లాహే సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటే గాని రిలీజ్ ఎప్పుడన్నది నిర్ణయిస్తారు.