
సినీ విశ్లేషకులు కత్తి మహేష్ కొద్దిరోజుల క్రితం నెల్లూరు లో కారు యాక్సిడెంట్ జరిగిన సంగతి తెలిసిందే. జూన్ 26న తెల్లవారుజామున కత్తి మహేష్ కారు ఘోర రొడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కత్తి మహేష్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. పోలీసులు ఆయన్ను నెల్లూరు మెడికవర్ హాస్పిటల్ లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో అక్కడ నుండి చెన్నై అపోలో హాస్పిటల్ కు తరలించారు. అప్పటి నుండి చికిత్స పొందుతున్న కత్తి మహేష్ శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. సినీ క్రిటిక్ గా క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 లో కంటెస్టంట్ గా కూడా వెళ్లారు కత్తి మహేష్. నటుడిగా, దర్శకుడిగా కూడా సినిమాలు చేశారు కత్తి మహేష్.