సురేష్ ప్రొడక్షన్ లో 'దొంగలున్నారు జాగ్రత్త'..!

కొద్దిపాటి గ్యాప్ తర్వాత సురేష్ ప్రొడక్షన్ లో వరుస సినిమాలు చేస్తున్నారు. వెంకటేష్ తో దృశ్యం 2, నారప్ప సినిమాలను రీమేక్ చేస్తున్న సురేష్ బాబు లేటెస్ట్ గా కీరవాణి తనయుడు సింహా హీరోగా ఓ సినిమా మొదలు పెట్టారు. నూతన దర్శకుడు సతీష్ త్రిపుర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు దొంగలున్నారు జాగ్రత్త టైటిల్ ఫిక్స్ చేశారు. థ్రిల్లర్ కథాంశంతో వస్తున్న ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ తో పాటుగా గురు  ఫిలిమ్స్ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారు.

సినిమాలో సముద్రఖని ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తారని తెలుస్తుంది. మత్తువదలరా సినిమాతో హీరోగా ప్రతిభ చాటిన సింహా రీసెంట్ గా తెల్లవారితే గురువారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. సింహా థర్డ్ మూవీగా దొంగలున్నారు జాగ్రత్త వస్తుంది.